Russia: లాక్ డౌన్ తో ఉద్యోగాలు పోయాయట... దిగంబరంగా రోడ్డెక్కిన రష్యా వాసులు!

  • కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన కోట్లాది మంది
  • రష్యాలో పరిస్థితి మరింత ఘోరం
  • తమకు పని కల్పించాలని నిరుద్యోగుల డిమాండ్
Nude Protest in Russia

కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచాన్ని మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మందికి పైగా నిరుద్యోగులుగా మారారని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రష్యాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రష్యాలోని బార్లు, రెస్టారెంట్లు, కెఫేల యజమానులు, షెఫ్ లు కనీస నెలవారీ ఆదాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పుడు వీరంతా తమ నిరసనలను వినూత్నంగా తెలుపుతూ, అందుకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన వారు నగ్న ప్రదర్శనలకు దిగారు. అయితే, పూర్తి నగ్నంగా కాకుండా, ప్లేట్లు, కప్పులు, బాటిళ్లు, కుర్చీలను కాస్తంతా అడ్డుగా పెట్టుకున్నారు లెండి. తమకు పని కల్పించాలన్నదే ఇప్పుడు వారి డిమాండ్. వీరిని చూసి జాలి పడటం తప్ప ప్రస్తుతానికి చేసేదేముందని చూసే వారు అంటున్నారు.

More Telugu News