Revanth Reddy: బిడ్డకు 'ఉద్యోగం' కల్పించడంలో ఉన్న ఆతృత... మా 'తెలంగాణ ఆడబిడ్డ'పై లేదా?: రేవంత్ రెడ్డి

  • ఉద్యోగాలు వచ్చినా, రాని పోస్టింగ్స్
  • వ్యవసాయ పనులకు వెళుతున్న అరుణ
  • ట్విట్టర్ లో మండిపడిన రేవంత్ రెడ్డి
Revant Slams Telangana Govt

ఎంతో కష్టపడి చదివి, ఉద్యోగాలు తెచ్చుకుని కూడా, పోస్టింగ్ లు రాని వారు తెలంగాణలో ఎందరో ఉన్నారని ఆరోపిస్తూ, "నిజాలు..నియామకాలు...!" అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికైన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన అరుణ, ఇప్పటికీ పోస్టింగ్ రాక, ఇల్లు గడవడం కోసం వ్యవసాయ పనులకు వెళుతుండగా, ఓ దినపత్రిక ఈ విషయమై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఎంపికై ఏడు నెలలు గడుస్తున్నా, ఇంకా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని, గ్రూప్-2 ఉద్యోగం కోసం తాను ఎంతో శ్రమించానని అరుణ వాపోగా, ఆ కథనాన్ని ట్వీట్ చేస్తూ, "బిడ్డకు” ఉద్యోగం” కల్పించడంలో  ఉన్న  ఆతృత...మా “తెలంగాణ ఆడబిడ్డ” పై  లేదా...!! " అంటూ తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

More Telugu News