AP High Court: ఏపీ హైకోర్టులో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం

Three AP High Court govt Lawyers Resigned
  • ప్రభుత్వ న్యాయవాదుల పనితీరుపై సమీక్ష
  • మార్చాలని నిర్ణయించిన ఏజీ
  • రాజీనామాలను ఆమోదించిన న్యాయశాఖ కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు.. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీశ్‌బాబు, షేక్‌ హబీబ్‌‌లు రాజీనామా చేశారు. వీరి రాజీనామా పత్రాలను ఈ నెల 8న అడ్వకేట్ జనరల్ శ్రీరాం ప్రభుత్వానికి పంపారు. న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి వీరి రాజీనామాలను ఆమోదిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

 ప్రభుత్వ న్యాయవాదుల పనితీరుపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఏడుగురు ప్రభుత్వ న్యాయవాదులు, 14 మంది ప్రభుత్వ సహాయ న్యాయవాదులను మార్చాలని అడ్వకేట్ జనరల్ శ్రీరాం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వీరు ముగ్గురూ రాజీనామా చేసినట్టు సమాచారం. ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
AP High Court
Andhra Pradesh
Lawyers
resignation

More Telugu News