EVV Satyanarayana: థాంక్యూ చంద్రబాబు సర్: అల్లరి నరేశ్

Actor Allari Naresh thanks Chandrababu for remembering his father EVV Satyanarayana
  • ప్రముఖ దర్శకుడు ఈవీవీ జయంతి నేడు
  • ఈవీవీని స్మరించుకున్న చంద్రబాబు
  • ఎంతో మందికి స్ఫూర్తిదాత అంటూ కితాబు
తెలుగు సినీ పరిశ్రమపై దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చెరగని ముద్ర వేశారు. వినూత్నమైన ఒరవడితో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడు రెండున్నర గంటల సేపు అన్ని బాధలు, టెన్షన్స్ మరిచిపోయి హాయిగా నవ్వుకునే చిత్రాలను తీసి... నిర్మాతలకు లాభాల పంట పండించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈవీవీ 2011 జనవరి 21న తిరిగి రాలేని సుదూర తీరాలకు వెళ్లిపోయారు. ఈరోజు ఆయన జయంతి. 1956 జూన్ 10న నిడదవోలు సమీపంలోని కోరుమామిడిలో ఆయన జన్మించారు.

ఈవీవీ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను స్మరించుకున్నారు. వినయం, మంచి స్వభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. వృత్తి పట్ల అంకిత భావం, అకుంఠిత శ్రమతో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలిచారని ప్రశంసించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు ట్వీట్ పట్ల ఈవీవీ కుమారుడు, సినీ నటుడు అల్లరి నరేశ్ స్పందించాడు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
EVV Satyanarayana
Chandrababu
Allari Naresh
Tollywood
Telugudesam

More Telugu News