Pakistan: భారత్ దాడి చేస్తోందంటూ పాకిస్థాన్ లో ప్రచారం.. వణికిపోయిన ప్రజలు!

False news spread in Pakistan that India is attacking
  • సోషల్ మీడియాలో నిన్న అర్ధరాత్రి పుకార్లు
  • కరాచీకి దగ్గరగా యుద్ధ విమానాలు వచ్చాయంటూ వార్తలు
  • బాలాకోట్ తరహా దాడి జరగబోతోందని ప్రచారం
పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు నిన్న అర్ధరాత్రి భీతిల్లిపోయారు. కంటిమీద కునుకు లేకుండా గడిపారు. భారత వాయుసేనకు చెందిన యుద్ద విమానాలు నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ను దాటి వచ్చేశాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలాకోట్ తరహాలో మరో దాడి జరపబోతోందన్న వార్తలు వైరల్ అయ్యాయి. యుద్ధ విమానాలను చూసిన అధికారులు కరాచీ అంతటా విద్యుత్ సరఫరాను నిలిపి వేశారని కొందరు చెప్పారు.

కరాచీకి దగ్గరగా చాలా విమానాలు వచ్చాయని... విమానాశ్రయం వద్ద తాను విమానాలను చూశానంటూ ఓ పాక్ పౌరుడు వాట్సాప్ లో తెలిపాడు. ఈ రకంగా పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత ఎలాంటి దాడులు చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Pakistan
India
Karachi
Balakot
Air Strikes

More Telugu News