మళ్లీ తెలుగు సినిమాలో శిల్పా శెట్టి!

10-06-2020 Wed 14:09
  • గతంలో కొన్ని తెలుగు సినిమాలలో శిల్ప
  • నితిన్ హీరోగా 'అంధాధూన్' రీమేక్
  • కీలక పాత్రలో శిల్పా శెట్టి
Shilpa shetty to act in a Telugu film
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే వుందో, ఇప్పుడు కూడా సేమ్ అలాగే వుంది. అదే నాజూకుతనం.. వయసు పెరిగినా బరువు మాత్రం ఏమాత్రం పెరగలేదు. అందుకు కారణం నిత్యం యోగా చేయడమే అంటుంది శిల్ప. ఇక గతంలో కొన్ని తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన శిల్పాశెట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. అది కూడా యంగ్ హీరో నితిన్ నటించే సినిమాలో కావడం విశేషం.

ఆమధ్య హిందీలో హిట్టయిన 'అంధాధున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో హారికా & హాసినీ క్రియేషన్స్ సంస్థ రీమేక్ చేస్తున్న విషయం విదితమే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం ప్రస్తుతం శిల్పా శెట్టితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.