Sadhineni Yamini: సినిమా హీరోలకు వాళ్ల స్వార్థమే ముఖ్యం: సాధినేని యామిని సంచలన వ్యాఖ్యలు!

Sadhineni Yamini Sensetional Comments on Tollywood Heros
  • స్వార్థం కోసమే జగన్ ను కలిశారు
  • అమరావతి ఆందోళనలపై చిరంజీవి స్పందించారా?
  • టీవీ చానెల్ కార్యక్రమంలో యామిని
సినిమా నటులకు వాళ్ల స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయని, ప్రజల సమస్యలు పట్టడం లేదని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, హీరోలు వారి స్వార్థం కోసమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఎన్నో సమస్యలు వచ్చినా, ఇండస్ట్రీ పెద్దలెవరూ స్పందించలేదని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయి, 13 మంది మరణించినా, ఒక్క హీరో కూడా స్పందించలేదని ఘాటు విమర్శలు చేశారు. వారిని సమాజమే సెలబ్రిటీలను చేసిందని, అలాంటి సమాజం ఆశలు, ఆకాంక్షలపై వారెవరు స్పందించడం లేదని, ఇది చాలా దారుణమని అన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేస్తున్న ఆందోళనలపై చిరంజీవి ఒక్కనాడు కూడా స్పందించలేదని నిప్పులు చెరిగారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు. 
Sadhineni Yamini
Jagan
Tollywood
Movie Industry
Heros

More Telugu News