Burundi: బురుండీ దేశాధ్యక్షుడి హఠాన్మరణం... కరోనా వల్లేనని అనుమానం!

Burundi President Died due to Heart Attack
  • శనివారం నాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక
  • కోలుకోగానే గుండెపోటు
  • కాపాడేందుకు డాక్టర్లు విఫలయత్నం చేశారన్న అధికారులు
బురుండీ దేశాధ్యక్షుడు ఎన్ కురుంజిజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన వయసు 55 సంవత్సరాలు. గత శనివారం నాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన, సోమవారం నాటికి కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. ఆ వెంటనే ఆయనకు గుండెపోటు వచ్చిందని, డాక్టర్లు ఆయన్ను కాపాడేందుకు విఫలయత్నం చేసినా ఫలితం లభించలేదని అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా, ఆయన కరోనాతో మరణించారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కురుంజియా భార్య డెనిస్ కు కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉన్న అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కురుంజిజా కూడా కరోనాతోనే మరణించి ఉండవచ్చని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
Burundi
President
Corona Virus
Heart Attack
Died

More Telugu News