uno: ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం: ఐరాస హెచ్చరిక

  • అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలి
  • కరోనా వైరస్‌ కారణంగా ఈ పరిస్థితులు తలెత్తే అవకాశం
  • పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగనుంది
  • 820 మిలియన్ల మంది ఆకలి బాధను అనుభవిస్తున్నారు
un on corona affect

ప్రపంచం ఆహార సంక్షోభం దిశగా వెళ్తోందని, అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి తెలిపింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య మరింత పెరిగిపోనుందని చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 820 మిలియన్ల మంది ప్రజలు ఆకలి బాధను అనుభవిస్తున్నారని, వారిలో ఐదేళ్లలోపు చిన్నారులే 144 మిలియన్ల మంది ఉన్నారని చెప్పింది. ప్రస్తుతానికి 780 కోట్ల ప్రపంచ జనాభాకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, అయితే, ఆ నిల్వలను క్షేత్ర స్థాయికి చేర్చడంలో ప్రపంచ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయట్లేదని తెలిపింది. ప్రపంచం ఆహార సంక్షోభంలోకి వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పింది.

More Telugu News