Balakrishna: మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు: చిరంజీవి

Chiranjeevi Wishes to Balakrishna
  • ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో సాగాలి
  • నిండు నూరేళ్ల సంబరం చేసుకోవాలి
  • ట్విట్టర్ లో చిరంజీవి
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి  షష్టి పూర్తి శుభాకాంక్షలు.

ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ప్రియమైన బాలకృష్ణా... నువ్వు అరవైల్లోకి అడుగుపెట్టావు. నీ అద్భుతమైన ప్రయాణాన్ని నేను ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. 
Balakrishna
Megastar
Wishes
Birthday

More Telugu News