Balakrishna: నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే!: జూ. ఎన్టీఆర్

Junior NTR Wishes to Balakrishna
  • నేడు బాలయ్య 60వ పుట్టిన రోజు
  • మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
  • ట్విట్టర్ లో వెల్లడించిన జూ. ఎన్టీఆర్
నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కాగా, జూనియర్ ఎన్టీఆర్, తన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. "నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాయ్... మీ 60వ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు. జై బాలయ్య" అని ట్వీట్ చేశారు. బాలకృష్ణకు నేడు పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాభినందనలు తెలియజేస్తూ, ట్వీట్లు పెడుతున్నారు. కాగా, నేటి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారన్న సంగతి తెలిసిందే.
Balakrishna
Jr. NTR
Birth Day
Twitter

More Telugu News