Mumbai: కేసుల సంఖ్యలో వుహాన్ ను దాటేసిన ముంబై!

Mumbai Crocess Wuhan in Corona Number
  • వుహాన్ లో 50,333 కేసులు
  • ముంబైలో కేసుల సంఖ్య 51,100
  • మరణాల విషయంలో మాత్రం మెరుగ్గా గణాంకాలు
మూడు రోజుల క్రితం మొత్తం కేసుల విషయంలో మహారాష్ట్ర, చైనాను అధిగమించగా, తాజాగా ముంబై నగరం, కేసుల విషయంలో వూహాన్ ను దాటేసింది. గత సంవత్సరం చివర్లో చైనాలోని వుహాన్ నగరంలో తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో మంగళవారం నాటికి 51,100 కేసులు నమోదయ్యాయి.

ఇక వుహాన్ లో 50,333 కేసులు నమోదు కాగా, 3,869 మంది మరణించారు. ముంబైలో మరణాల సంఖ్య 1,760గా ఉంది. మరణాల విషయంలో మాత్రం వుహాన్ తో పోలిస్తే ముంబైలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉండటమే కాస్తంత ఊరటనిచ్చే అంశం. ఇక మొత్తం మహారాష్ట్రలో 90,787 కేసులు రాగా, 42,638 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 2,259 కొత్త కేసులు వచ్చాయి. మరో 120 మంది మరణించారు.
Mumbai
Wuhan
Corona Virus
Number

More Telugu News