Chandrababu: పార్టీ ద్రోహులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు: చంద్రబాబు

Chandrababu talks with party leaders via online
  • వలసపోతున్న ప్రకాశం టీడీపీ!
  • రేపు వైసీపీలో చేరేందుకు శిద్ధా రెడీ!
  • పార్టీ ద్రోహులతో జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు
గత కొన్నిరోజులుగా టీడీపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రకాశం జిల్లా నేతలు వైసీపీలోకి వలసలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి రేపు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆన్ లైన్ లో పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, పార్టీకి ద్రోహం చేసిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పార్టీకి ద్రోహం చేసినవాళ్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారని స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారెవరినీ ప్రజలు ఆదరించరని, ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పేర్కొన్నారు.
Chandrababu
Telugudesam
Party
Prakasam District
YSRCP
Andhra Pradesh

More Telugu News