Mahima Chaudhary: చనిపోతున్నా అనిపించింది.. ముఖం నుంచి 67 గాజు ముక్కలు తీశారు: నాటి యాక్సిడెంట్ గురించి మహిమా చౌదరి

  • షూటింగ్ కు వెళ్తుండగా రోడ్డు యాక్సిడెంట్ కు గురైన మహిమ
  • బెంగళూరులోని స్టూడియోకు వెళ్తుండగా కారును ఢీకొన్న ట్రక్కు
  • ఆ తర్వాత కెరీర్ పరంగా కోలుకోలేకపోయానన్న మహిమ
Mahima Chaudhary opens up on her dreadful accident

షారుఖ్ ఖాన్, అమ్రీష్ పురి, సుభాష్ ఘయ్ కాంబినేషన్లో 1997లో వచ్చిన 'పర్దేశ్' చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహిమా చౌదరి ఆ తర్వాత సక్సెస్ ఫుల్ నటిగా కొనసాగింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులకు ఆమె ఎంతో దగ్గరైంది. తెలుగులో సైతం ఆమె నటించి మెప్పించింది. అయితే అజయ్ దేవగణ్ తో కలసి నటించిన 'దిల్ క్యా కరే' సినిమా షూటింగ్ సమయంలో ఆమె యాక్సిడెంట్ కు గురైంది. తాజాగా ఆ భయంకర ఘటన గురించి మీడియాతో పంచుకుంది.

'అప్పుడు నేను అజయ్ దేవగణ్, కాజల్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నా. బెంగళూరులో స్టూడియోకు వెళ్తున్నప్పుడు నేను ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొంది. కారు అద్దం దాదాపు నా మొహంలోకి వెళ్లింది. ఆ క్షణంలో చచ్చిపోతున్నాననిపించింది. హాస్పిటల్ కు వెళ్లేందుకు కూడా ఎవరూ సాయం చేయలేదు. చాలా సేపటి తర్వాత ఆసుపత్రికి చేర్చారు. అజయ్ దేవగణ్ పరామర్శించాడు. అమ్మ కూడా ఆసుపత్రికి వచ్చింది. అద్దంలో నా ముఖం చూసి భయపడిపోయాను. నాకు సర్జరీ చేశారు. 67 గాజు ముక్కలను తీశారు.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో నా చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. నాకు యాక్సిడెంట్ అయినట్టు జనాలకు తెలియకూడదని అనుకున్నా. ఎందుకంటే జనాలు అంత సపోర్టివ్ గా ఉండరు. అయితే నేను కోలుకునే సరికి చాలా కాలం పట్టింది. తిరిగి కోలుకున్నప్పటికీ కెరీర్ మాత్రం ఆశాజనకంగా లేకపోయిందని చెప్పింది.

More Telugu News