ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా నెగెటివ్

09-06-2020 Tue 19:11
  • నిన్న జ్వరం, గొంతునొప్పితో బాధపడిన కేజ్రీవాల్
  • తనకు తానుగా క్వారంటైన్ విధించుకున్న ఢిల్లీ సీఎం
  • ఈ ఉదయం కరోనా పరీక్షలు
Delhi CM Arvind Kejriwal tested corona negative

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని గంటలుగా ఉత్కంఠ అనుభవించిన ఆయన తనకు కరోనా లేదని తెలియడంతో కుదుటపడ్డారు. నిన్న అస్వస్థతకు గురైన కేజ్రీవాల్ తనకు తాను క్వారంటైన్ విధించుకున్నారు.

స్వల్పంగా జ్వరం, గొంతునొప్పి రావడంతో కరోనా పరీక్షలు చేయించుకుంటానని వెల్లడించారు. ఈ ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకలేదని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా వెల్లడించారు. దేవుడి దయ వల్ల అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా నెగెటివ్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.