Chiranjeevi: 'మెగా' బడ్జెట్టుకి కాస్త కోత పడిందట!

  • భారీ చిత్రాలపై లాక్ డౌన్ ఎఫెక్ట్
  • బడ్జెట్టులో కోత పెడుతున్న నిర్మాతలు
  • చిరంజీవి 'ఆచార్య'కూ తప్పని కోత
  • స్క్రిప్టులో అనుగుణంగా స్వల్ప మార్పులు  
  Budeget cutting for Acharya Movie

చిత్రరంగాన్ని కరోనా కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు.. ఎప్పుడూ సినిమా రిలీజులు, షూటింగులతో కళకళలాడుతూ వుండే ఈ రంగం లాక్ డౌన్ కారణంగా దాదాపు మూతబడింది. రెండున్నర నెలలుగా షూటింగులు లేవు.. థియేటర్లలో సినిమాలు లేవు. థియేటర్లు తెరచినా, ప్రేక్షకులు వస్తారో రారో తెలియని పరిస్థితి.

దీని వల్ల ప్రస్తుతం నిర్మాణంలో వున్న భారీ బడ్జెట్ చిత్రాలకైతే అపారనష్టం జరుగుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. కోట్లాది రూపాయలతో చిత్ర నిర్మాణం జరిపితే, ప్రస్తుత పరిస్థితులలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది సందేహమే! అందుకే, ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణంలో వున్న కొన్ని భారీ చిత్రాల నిర్మాతలు బడ్జెట్టును కుదించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమా విషయంలో కూడా నిర్మాతలు బడ్జెట్టు పరంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే, చిరంజీవి, కొరటాల కాంబినేషన్ కాబట్టి ఈజీగా వర్కౌట్ అయిపోయేది. అయితే, ప్రస్తుతం సినిమా రంగం కుదేలవడంతో, ముందుచూపుతో ఈ చిత్రం బడ్జెట్టును కొంతవరకు తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ నలభై శాతం వరకు పూర్తయిపోయింది. మిగిలిన షూటింగుకి సంబంధించి బడ్జెట్టు విషయంలో కొంత కటింగ్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా, సినిమా కథపై ప్రభావం చూపని రీతిలో స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేశారట. దీని వల్ల బడ్జెట్టు పరంగా ఎంతోకొంత నిర్మాతలకు తగ్గుతుందని, సేఫ్ జోన్ లో ఉంటారనీ అంటున్నారు.      

More Telugu News