Sidda Raghava Rao: టీడీపీకి భారీ షాక్.. రేపు వైసీపీలో చేరనున్న శిద్దా రాఘవరావు

Sidda Raghavarao to join YSRCP
  • ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో షాక్
  • కుమారుడితో పాటు వైసీపీలో చేరనున్న శిద్దా
  • ఇప్పటికే వైసీపీలో ఉన్న శిద్దా సోదరులు

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరబోతున్నారంటూ మరెందరో పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. బలరాం వైసీపీ కండువా కప్పుకోకపోయినా... ఆయన అనధికారికంగా వైసీపీలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తన కుమారుడితో కలిసి రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు.

శిద్దా రాఘవరావు ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మాగుంట చేతిలో ఓడిపోయారు. ఇప్పటికే శిద్దా సోదరులు వైసీపీలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే శిద్దా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. రేపు ఆయన పార్టీ మారబోతున్నారు.

  • Loading...

More Telugu News