కోర్టులను ఆశ్రయించాల్సి రావడానికి కారణం ఇదే: కోదండరామ్
- కరోనా పరీక్షా కేంద్రాలను పెంచండి
- ప్రభుత్వ తీరు దారుణంగా ఉంది
- వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు
ప్రజల ఆరోగ్యానికి అతి తక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారని కోదండరామ్ విమర్శించారు. ఓవైపు వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే... ప్రభుత్వ తీరు మాత్రం దారుణంగా ఉందని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని... దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం సమస్యను మరింత సంక్లిష్టం చేయడమే అవుతుందని చెప్పారు.