Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్... 7.09కి మరో గిఫ్ట్!

  • నేటి సాయంత్రం పాట విడుదల
  • ఆపై కాసేపటికి మరో సర్ ప్రయిజ్
  • ప్రకటించిన ద్వారకా క్రియేషన్స్
Balakrishna Double Treet for Fans

తన 60వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే, తాను స్వయంగా పాడిన పాటను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేసి, తన అసంఖ్యాక అభిమానులను సంతృప్తి పరచాలని నందమూరి బాలకృష్ణ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 5.03 నిమిషాలకు ఎన్బీకే ఫిల్మ్స్ ఈ పాటను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బాలయ్య అభిమానులకు మరో గిఫ్ట్ రాత్రి 7.09 గంటలకు అందనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రానికి సంబంధించిన ట్రీట్ ఇది.

'బీబీ3' గర్జన ఈ రాత్రి 7.09కి వినిపించనుందని ద్వారకా క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. నందమూరి నటసింహం పుట్టిన రోజు కానుకగా, దీన్ని విడుదల చేయనున్నామని తెలిపింది. ఈ ట్వీట్ ను బోయపాటి శ్రీను, థమన్, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులకు ట్యాగ్ చేసింది. ఇక బాలయ్య అందించే ఈ డబుల్ ట్రీట్ ఎలా ఉంటుందో తెలియాలంటే, మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

More Telugu News