NDRF: ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిలో 50 మందికి కరోనా!

50 NDRF personnel tested corona positive
  • ఎంఫాన్ తుపాను అనంతర సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
  • ఎన్డీఆర్ఎఫ్‌లో పెరుగుతున్న కేసులతో ఆందోళన
  • మొత్తం అందరికీ పరీక్షలు చేయాలని నిర్ణయం
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్)లో 50 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో ఎంఫాన్ తుపాను అనంతర సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బందిలో 50 మంది కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు. కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 170 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది.

దీంతో చికిత్స కోసం వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కటక్ సమీపంలోని ముందాలీ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ భవనంలో సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. దేశంలో మరో 24 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మొత్తం సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయించింది.
NDRF
Amphan
Corona Virus

More Telugu News