Jagan: అనితారాణి వ్యవహారంలో సీఎం జగన్ కీలక నిర్ణయం.. కేసు సీఐడీకి అప్పగింత!

  • ఏపీలో కలకలం రేపుతున్న డాక్టర్ అనితారాణి ఉదంతం
  • వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు
  • నిజానిజాలను నిగ్గుతేల్చాలంటూ ఆదేశాలు 
Jagan orders CID probe into doctor Anitha Rani case

చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ డాక్టర్ అనితారాణి వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. ఏం జరిగిందో నిజానిజాలను నిగ్గుతేల్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ దళిత డాక్టర్ అనితారాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. తన బాధను తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితకు ఫోన్ లో వెళ్లబోసుకున్నారు. తనపై జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలో కూడా తన ఫొటోలను తీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాల దాడి మొదలైంది. దళితులను ప్రభుత్వం వేధిస్తోందని... మొన్న డాక్టర్ సుధాకర్, ఈరోజు డాక్టర్ అనితారాణి అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును సీఐడీకి అప్పగించారు.

More Telugu News