Shruti Haasan: లాక్ డౌన్ లో కూడా ఒంటరిగానే గడుపుతున్న శ్రుతిహాసన్!  

Shruti Haasan is spending lonely in lockdown
  • ఏకాంతాన్ని నేను ఇష్టపడతా
  • సమస్యలను ఎదుర్కోవడం ఒంటరితనం నుంచే అలవాటైంది
  • ఒంటరిగా ఇంట్లో ఎన్నో పనులు చేస్తా

లాక్ డౌన్ నేపథ్యంలో సినీ ప్రముఖులందరూ తమ కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. షూటింగులతో అనుక్షణం బిజీగా ఉండే వారంతా.. ఈ సమయాన్ని కుటుంబంతో ఆనందంగా గడిపేస్తున్నారు. అయితే హీరోయిన్ శ్రుతిహాసన్ మాత్రం ఒంటరిగానే ఉంటోందట. కుటుంబ సభ్యులకు దూరంగా ముంబైలోని తన ఫ్లాట్ లో ఒంటరిగా గడుపుతోంది.

దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు ఒంటరిగా ఉండటమంటే ఇష్టమని... ఏకాంతాన్ని తాను ఇష్టపడతానని చెప్పింది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం తనకు ఒంటరితనం నుంచే అలవాటైందని తెలిపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి పనులను స్వయంగా చేసుకుంటానని, పుస్తకాలను చదువుతానని, సంగీత సాధన చేస్తానని శ్రుతి చెప్పింది.

  • Loading...

More Telugu News