Andhra Pradesh: ఈ నెల 16 నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు... సాయంత్రం నోటిఫికేషన్!

AP Assembly budget sessions will be start shortly
  • గవర్నర్ వద్దకు చేరిన అసెంబ్లీ సమావేశాల ఫైల్
  • అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలన్నది తేల్చనున్న బీఏసీ
  • ఈ నెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం!
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో క్రమంగా సాధారణ జనజీవనం నెలకొంటోంది. ప్రభుత్వ కార్యకలాపాలు కూడా పూర్తిస్థాయిలో షురూ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 16 నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రంలోగా విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద ఉంది. జూన్ 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవనుండగా, జూన్ 18న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఎన్నిరోజుల పాటు సమావేశాలు జరగాలన్నది బీఏసీ భేటీ అనంతరం తేలనుంది.
Andhra Pradesh
Andhra Pradesh Assembly
Budget Session
Notification

More Telugu News