Balakrishna: మీరంతా ఎప్పుడూ మా కుటుంబ సభ్యులే: నారా బ్రాహ్మణి

Nara Brahmanis message to her father Balakrishna fans
  • 10వ తేదీన బాలయ్య 60వ పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో అభిమానుల సందడి
  • నాన్నగారి వ్యక్తిత్వాన్ని చాటేలా పోస్టులు పెడుతున్నారంటూ బ్రాహ్మణి కితాబు
ఈనెల 10వ తేదీన నందమూరి అభిమానులకు పండుగరోజు. ఎందుకంటే... ఆరోజు బాలకృష్ణ 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన వేడుకలకు అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో, ఇళ్లలోనే కుటుంబసభ్యుల మధ్య బర్త్ డే వేడుకలను నిర్వహించుకోనున్నారు. మరోవైపు, బాలయ్య పెద్ద కుమార్తె, నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి ఈ సందర్భంగా భావోద్వేగపూరిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

'నాన్నగారి అభిమానులందరికీ నమస్కారం. ఆయన 60వ జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడుతున్నారు. నాన్నగారి వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా ఆసక్తికర పోస్టులు, హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ సేవా కార్యక్రమాలను చేపడుతుండటం ప్రశంసనీయం. నాన్నగారి జన్మదిన వేడుకలను అభిమానులంతా వారి కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీనివల్ల మీరు, మీ చుట్టూ ఉన్నవారు అందరూ సేఫ్ గా ఉంటారు.

మీరంతా ఎప్పుడూ మా కుటుంబసభ్యుల వంటి వారే. నాన్నగారికి ఎలాంటి క్రమశిక్షణ ఉందో... మీకు కూడా అలాంటి క్రమశిక్షణే ఉండటం సంతోషకరం. మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. మీ బ్రాహ్మణి'  అంటూ స్పందించారు.
Balakrishna
60th Birthday
Nara Brahmani
Telugudesam
Tollywood

More Telugu News