Radhika Apte: లాక్ డౌన్ టైమ్ లో కొత్తకొత్త ఆలోచనలు వస్తున్నాయి: రాధికా ఆప్టే

Getting new thoughts in lockdown says Radhika Apte
  • లాక్ డౌన్ ను చాలా ఆస్వాదిస్తున్నా
  • ఎనిమిదేళ్లుగా విరామం లేకుండా పని చేశాను
  • రెస్టారెంట్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తోంది
రాధికా ఆప్టే...  ఇటు టాలీవుడ్ తో పాటు, అటు బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని నటి. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పెళ్లై, కుమారుడు ఉన్నప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా... తనదైన శైలిలో నటించడం రాధిక స్పెషాలిటీ. తాజాగా అందరు సినీ సెలబ్రిటీల మాదిరే రాధిక కూడా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైంది. లాక్ డౌన్ ను తాను చాలా ఆస్వాదిస్తున్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, విరామం లేకుండా గత ఎనిమిదేళ్లుగా పని చేస్తూనే ఉన్నానని రాధిక తెలిపింది. ఇప్పుడు తనకు విరామం దొరికిందని చెప్పింది. స్వయంగా తానే కొన్ని కథలు రెడీ చేసుకుంటున్నానని తెలిపింది. భవిష్యత్తు గురించి తాను ఎక్కువగా ఆలోచించనని... ఎందుకంటే జీవితంలో అసంతృప్తి ఎక్కువైతే సంతోషం దూరమవుతుందని చెప్పింది. ఆనందంగా జీవితాన్ని గడపడమే తనకు ముఖ్యమని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ప్రశాంతంగా ఆలోచిస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయని చెప్పింది. సినిమా కెరీర్ ను పూర్తిగా పక్కన పెట్టేసి, రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభిస్తే ఎలాగుంటుందనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపింది.
Radhika Apte
Bollywood
Tollywood
Business

More Telugu News