Revanth Reddy: ఏడాది పాటు ఆస్తిపన్ను రద్దు చేయండి: జీహెచ్ఎంసీ కమిషనర్ ను కోరిన రేవంత్

  • కరోనా కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది
  • లాక్ డౌన్ తో ఆదాయాన్ని కోల్పోయారు
  • ఇంటి పన్ను కట్టే స్తోమత ప్రస్తుతానికి జనాలకు లేదు
Dont charge property tax for one year requests Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై తీవ్ర ఆరోపణలు చేసి, పతాక శీర్షికల్లోకి ఎక్కిన రేవంత్... ఇప్పుడు మరో కొత్త డిమాండ్ తో ముందుకు సాగుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏడాది పాటు పన్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిశారు.

కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక స్థితి దారుణంగా తయారైందని...  లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆదాయాన్ని కోల్పోయారని రేవంత్ చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇంటి పన్ను కట్టే స్తోమత ప్రస్తుతానికి లేదని ఆయన తెలిపారు. కాబట్టి ఏడాది పాటు ఇంటి పన్నును రద్దు చేయాలని చెప్పారు. ఉన్నత వర్గాల నుంచి పన్ను వసూలు చేస్తే అభ్యంతరం లేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి, తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.

More Telugu News