Rakul Preet Singh: తేజ సినిమాలో కథానాయికగా రకుల్

Rakul Preeth Singh to play opposite Gopichand
  • గతంలో 'లౌక్యం'లో నటించిన గోపీచంద్, రకుల్
  • తేజ దర్శకత్వంలో 'అలివేలుమంగ వెంకటరమణ'
  • రకుల్ కి ఫోన్ ద్వారా కథ వినిపించిన తేజ
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంట మరోసారి జతకట్టనున్నారు. గతంలో వీరిద్దరూ కలసి నటించిన 'లౌక్యం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి నటించలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి నటించే అవకాశం ఇప్పుడు వస్తోంది.

ప్రముఖ దర్శకుడు తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా 'అలివేలుమంగ వెంకటరమణ' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ పని కూడా పూర్తయింది. ఇక ఇందులో నటించే కథానాయిక విషయంలో ఇప్పటికే చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొదట్లో సాయిపల్లవిని అడగగా ఆమె తిరస్కరించిందని వార్తలొచ్చాయి. అలాగే తర్వాత కాజల్, అనుష్కల పేర్లు వినిపించాయి. అయితే, తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. దర్శకుడు తేజ ఫోన్ ద్వారా రకుల్ కి కథ వినిపించాడని, చేయడానికి ఆమె సానుకూలంగా స్పందించిందని సమాచారం.  
Rakul Preet Singh
Teja
Gopichand
Anushka Shetty

More Telugu News