Jio: కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో

  • ఏడాదిపాటు డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ ఉచితం
  • ఎంపిక చేసిన ప్లాన్లపైనే ఉపలబ్దం
  • ఎయిర్ టెల్ కు పోటీగా జియో నిర్ణయం
Jio offers Disney Hotstar VIP subscription free

అనేక ఆఫర్లలో వినియోగదారులను కట్టిపడేస్తున్న జియో తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. విభిన్న రకాల కంటెంట్ కు నెలవైన డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ను ఇప్పుడు ఉచితంగా అందిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ కు సంబంధించిన వివరాలను జియో గతరాత్రి తీసుకువచ్చింది. తన ప్రధాన ప్రత్యర్థి ఎయిర్ టెల్ కు పోటీగా జియో ఈ ఆఫర్ తీసుకువచ్చింది. రూ.401 మంత్లీ రీచార్జ్, రూ.2,599 యాన్యువల్ రీచార్జ్ గానీ, లేదా, రూ.612, రూ.1208 డేటా ఓచర్లను గానీ ఎంచుకుంటే వారికి ఏడాదిపాటు రూ.399 విలువైన డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

More Telugu News