Imran Khan: మోదీ లాక్ డౌన్ విధిస్తే నలిగిపోయింది పేదవాళ్లే: పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలు

  • లాక్ డౌన్ ను కోరుతోంది ధనికులేనన్న ఇమ్రాన్
  • లాక్ డౌన్ విధించినా వాళ్లకేమీ కాదని వ్యాఖ్యలు
  • తాము స్మార్ట్ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు వెల్లడి
Imran Khan explains smart lockdown

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాక్ డౌన్ అంశంపై వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ విధించాలని కోరుతున్న వాళ్లంతా విశాలమైన భవనాలు, కావాల్సినంత ఆదాయం ఉన్నవాళ్లేనని, లాక్ డౌన్ విధించినా అలాంటివాళ్లకేమీ కాదని అన్నారు. కానీ ఓ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని, పేద దేశాల్లో దారిద్ర్యం మరింత పెరుగుతుందని, పేదవాళ్లు నలిగిపోతారని వివరించారు. భారత్ లో మోదీ లాక్ డౌన్ విధిస్తే ఇదే జరిగిందని, నిరుపేదలే చితికిపోయారని వ్యాఖ్యానించారు.

ఇందుకు ఒక్కటే పరిష్కారం అని, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా వినూత్న తరహా మార్గదర్శకాలతో కూడిన స్మార్ట్ లాక్ డౌన్ అమలు చేయడమేనని అన్నారు. ఈ విధానాన్ని ఆవిష్కరించిన ఆద్యులలో తాము కూడా ఉన్నామని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా, నూతన మార్గదర్శకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పౌర సమాజంపైనా, మీడియాపైనా, ఉలేమాలపైనా, టైగర్ ఫోర్స్ పైనా ఉందని సెలవిచ్చారు.

More Telugu News