DK Aruna: రాష్ట్రంలో వైద్యుల ప్రాణాలకే భరోసా ఇవ్వలేకపోతున్నారు: డీకే అరుణ

  • కరోనా టెస్టుల్లో తెలంగాణ పూర్తిగా వెనుకబడిందని విమర్శలు
  • ఒక్క ఆసుపత్రిలోనూ సరైన ఏర్పాట్లు లేవని ఆరోపణ
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డాక్టర్లు, పోలీసులకు కరోనా సోకుతోందని ఆగ్రహం
DK Aruna questions Telangana government over corona situations

తెలంగాణలో కరోనా పరిస్థితులపై బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా టెస్టుల్లో తెలంగాణ పూర్తిగా వెనుకబడిందని అన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్యుల ప్రాణాలకే భరోసా ఇవ్వలేకపోతోందని విమర్శించారు. ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు.

కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన గచ్చిబౌలి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వైద్యసిబ్బంది, పోలీసులకు కరోనా సోకుతోందని మండిపడ్డారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో లేవని అన్నారు. 10 లక్షల పీపీఈ కిట్లు అందించామని మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారని, ఆ కిట్లు ఎటు పోయాయో చెప్పాలని, రాష్ట్రంలోని పీహెచ్ సీలకు ఎన్ని మాస్కులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

More Telugu News