Raghavendra Rao: రూపాయి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో సినిమాలు తీసింది రామానాయుడే: రాఘవేంద్రరావు

Raghavendra Rao remembers star producer Ramanaidu
  • ఇవాళ రామానాయుడు జయంతి
  • మా మంచి మూవీ మొఘల్ అంటూ దర్శకేంద్రుడి ట్వీట్
  • ఆయనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని వెల్లడి
తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగాన్ని చూసిన నిర్మాతల్లో రామానాయుడు అగ్రగణ్యులు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా రామానాయుడ్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"అందరు నిర్మాతలు రూపాయి కోసం సినిమా తీసేవారే. కానీ తాను రూపాయి కోసమే కాకుండా దాని మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయగలిగిన ఏకైక నిర్మాత రామానాయుడే. మా మంచి మూవీ మొఘల్ రామానాయుడు జయంతి ఇవాళ" అంటూ స్పందించారు. దేవత సినిమా నుంచి రామానాయుడు బ్యానర్ తో తన అనుబంధం మొదలైందని, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని రాఘవేంద్రరావు గుర్తుచేసుకున్నారు.
Raghavendra Rao
Ramanaidu
Birth Anniversary
Tollywood
Producer

More Telugu News