Chandrababu: కుప్పంలోనే కాదు తాడేపల్లిలోని ఏ గల్లీలోనైనా చర్చకు సిద్ధం: బొండా ఉమ

  • ఏడాదిలో జరిగిన సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలన్న శ్రీకాంత్ రెడ్డి
  • చర్చకు తాను వస్తానన్న బొండా ఉమ
  • ఏడాదిలో విధ్వంసం సృష్టించారని మండిపాటు
I am accepting Gadikota Srikanth Reddys challenge says Bonda Uma

ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చకు సిద్ధమని... సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పం నుంచే బహిరంగ చర్చలు మొదలు పెడదామని వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు చంద్రబాబు రాలేకపోతే... లోకేశ్ ను పంపాలని అన్నారు. దీనిపై టీడీపీ నేత బొండా ఉమ స్పందించారు. సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని ఆయన చెప్పారు. ఒక్క కుప్పంలోనే కాదని... తాడేపల్లిలోని ఏ గల్లీలోనైనా చర్చకు తాను రెడీగా ఉన్నానని అన్నారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ పై బొండా ఉమ పలు విమర్శలు గుప్పించారు. ఒక్క రాజధానినే కట్టలేని జగన్ మూడు రాజధానులను నిర్మిస్తారా? అని ఎద్దేవా చేశారు. విశాఖలో రియలెస్టేట్ వ్యాపారాన్ని పెంచడానికే అక్కడ రాజధాని అంటూ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్టు భూములను కూడా కొట్టేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవి కోసం జగన్ కు బాకాలు ఊదే వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్ కు పాలించడం చేత కావడం లేదని... ఏడాదిలో విధ్వంసం సృష్టించారని అన్నారు.

More Telugu News