కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు మాతృవియోగం
- శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచిన చంద్రకాంత గోయల్
- తన తల్లి వృద్ధాప్య కారణాలతో మరణించిందన్న పియూష్ గోయల్
- తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితమిచ్చిందని వెల్లడి
అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ అనంతరం చంద్రకాంత గోయల్ ముంబయిలో కార్పొరేటర్ గా ప్రస్థానం ఆరంభించారు. ఆపై ముంబయిలోని మాతుంగ అసెంబ్లీ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, చంద్రకాంత గోయల్ భర్త దివంగత వేద్ ప్రకాశ్ గోయల్ సుదీర్ఘకాలం బీజేపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. ఆయన వాజ్ పేయి సర్కారులో షిప్పింగ్ మంత్రిగా పనిచేశారు.