white python: కర్ణాటకలో కనిపించిన అరుదైన శ్వేతవర్ణం కొండచిలువ.. వీడియో ఇదిగో!

  • బంట్వాళ తాలూకాలోని కావళకట్టె గ్రామంలో కనిపించిన కొండచిలువ
  • జన్యులోపం కారణంగా ఇలా జన్మిస్తాయన్న అటవీ అధికారులు
  • తెల్లగా ఉండడంతో చిన్నప్పుడే ఇతర పాములకు ఆహారంగా మారుతాయన్న అధికారులు
Extremely rare white albino python found in Karnataka

కర్ణాటకలోని మంగళూరులో అరుదైన శ్వేతవర్ణం కొండచిలువ కనిపించింది. బంట్వాళ తాలూకాలోని కావళకట్టె గ్రామంలో కనిపించిన ఈ శ్వేతవర్ణం కొండచిలువను పాములు పట్టడంలో నిపుణుడైన కిరణ్ బంధించాడు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించాడు. వారి సహకారంతో దీనిని పిలికుళ నిసర్గధామకు తరలించారు.

శ్వేతవర్ణం కొండచిలువ గురించి అటవీ అధికారులు మాట్లాడుతూ వీటిని ‘ఎల్బినో’ అని పిలుస్తారని, జన్యులోపం కారణంగానే ఇలా తెల్లగా జన్మిస్తాయని పేర్కొన్నారు. అయితే, ఇలా చాలా అరుదుగా జరుగుతుందని వివరించారు. ఇవి తెల్లగా, ఆకర్షణీయంగా కనిపించడంతో చిన్నప్పుడే వాటిని ఇతర పాములు తినేస్తాయని పేర్కొన్న అధికారులు.. ఇది ఇంత పెద్దగా పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయమేనన్నారు.

More Telugu News