Raghava Lawrence: కరోనా నుంచి చిన్నారులందరూ కోలుకున్నారు: దర్శకుడు రాఘవ లారెన్స్

Raghava Lawrence says that all children In his trust recovered from covid
  • కరోనా బారిన 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది
  • కోలుకుని అందరూ ట్రస్టుకు చేరుకున్నారన్న లారెన్స్
  • వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు
కరోనా బారినపడిన తన ట్రస్టులోని చిన్నారులందరూ కోలుకున్నట్టు ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తెలిపారు. ఆయన నిర్వహిస్తున్న ట్రస్టులోని 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది ఇటీవల కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారందరూ కోలుకున్నారని లారెన్స్ తెలిపారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారందరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ట్రస్టుకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాత్రనక, పగలనక కష్టపడుతున్న వైద్యులు, నర్సులకు లారెన్స్ ధన్యవాదాలు తెలిపారు. పిల్లలు కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు లారెన్స్ ట్వీట్ చేశారు.
Raghava Lawrence
Kollywood
Trust
Corona Virus

More Telugu News