Gujarat: గుజరాత్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా.. మరో ఎమ్మెల్యే గుడ్‌బై!

Gujarat Congress MLA Brijesh Merja resigns ahead of RS polls
  • ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బ్రిజేష్
  • మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు రాజీనామా
  • రాష్ట్రంలో 60కి పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం
రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బుధవారం అక్షయ్ పటేల్, జీతూ చౌధరిలు రాజీనామా చేయగా, నిన్న మోర్బీ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా తన ఎమ్మెల్యే పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

 బ్రిజేష్ రాజీనామాను స్పీకర్ రాజేంద్ర త్రివేది ఆమోదించారు. కాగా, మార్చిలో ఒకసారి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజా రాజీనామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం 60కి పడిపోయింది. ఈ నెల 19న రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, గుజరాత్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇద్దరిని బరిలో నిలపగా, బీజేపీ ముగ్గురిని నిలిపింది.
Gujarat
Congress
Brijesh Merja
RS polls

More Telugu News