Yuvraj Singh: ఆ మాట అనుకోకుండా వచ్చింది... నన్ను క్షమించండి: యువరాజ్ సింగ్

Yuvraj Singh apologise after a live chat with Rohit Sharma
  • ఊహించని వివాదంలో యువరాజ్ సింగ్
  • రోహిత్ శర్మతో మాట్లాడుతూ ఓ పదం వాడిన యువీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత నేతలు
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల రోహిత్ శర్మతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ, 'భాంగి' అనే పదం వాడాడు. వాస్తవానికి ఈ పదాన్ని టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ను ఉద్దేశించి ప్రయోగించాడు. కానీ, ఇది ఓ కులాన్ని బాధించేలా ఉందని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని హర్యానాలో దళిత హక్కుల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువీ స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో లేఖ పోస్టు చేశాడు.

తాను ఎవరినీ నొప్పించేందుకు ఆ పదం వాడలేదని, రోహిత్ శర్మతో మాట్లాడుతుంటే అనుకోకుండా వచ్చేసిందని వివరణ ఇచ్చాడు. తనకు కులం, మతం, వర్గం ఇవేవీ ప్రాధాన్య అంశాలు కావని, తన జీవితంలో ఎప్పుడూ వర్ణ వివక్ష జోలికి వెళ్లలేదని, ప్రతి ఒక్కరూ గౌరవంతో బతకాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశాడు. ఏదేమైనా తాను అన్న పదం కొందరిని బాధించిందని, అందుకే క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. బాధ్యతగల భారతీయుడిగా ఎంతో బాధపడుతున్నానని వెల్లడించాడు.
Yuvraj Singh
Rohit Sharma
Chahal
Police
Team India
Cricket
India

More Telugu News