Bar and Restaurant: రెస్టారెంట్ వాటర్ ట్యాంకులో శవాలై తేలిన ఇద్దరు సిబ్బంది.. హత్య కేసు నమోదు!

Bodies Of 2 Staff Found Inside Restaurant Near Mumbai
  • ముంబై శివార్లలోని బార్ అండ్ రెస్టారెంట్ లో ఘటన
  • మృతులు ఇద్దరూ అదే బార్ అండ్ రెస్టారెంట్ లో పని చేసేవారే
  • ఇద్దరినీ చంపేశారంటూ ఫోన్ వచ్చిందని ఫిర్యాదు చేసిన ఓనర్
  • మృతదేహాలపై గాయాల ఆనవాళ్లు
ఓ బార్ అండ్ రెస్టారెంట్ డ్రైనేజీలో రెండు మృతదేహాలు దొరకడం ముంబై నగరంలో కలకలం రేపింది. ముంబై శివార్లలోని బార్ అండ్ రెస్టారెంట్ లో నిన్న రాత్రి వీటిని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే, తన రెస్టారెంట్ లో పని చేసే ఇద్దరు సిబ్బంది కనిపించడం లేదంటూ... సదరు రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

హరీశ్ శెట్టి (42), ఎన్.పండిట్ (58) ఇద్దరూ తన వద్ద పని చేస్తున్నారని.. వీరిద్దరూ తనకు టచ్ లోకి రావడం లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. వీరిద్దరూ రెస్టారెంటు ప్రాంగణంలోనే నివసిస్తుంటారని చెప్పారు. వీరిద్దరినీ చంపేశారంటూ తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని యజమాని తెలిపారు.  

ఫిర్యాదు నేపథ్యంలో, ఒక పోలీసు టీమ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లి, క్షుణ్ణంగా పరిశీలించగా... ఇద్దరి మృతదేహాలు వాటర్ ట్యాంకులో కనిపించాయి. వారి శరీరాలపై గాయాలు కనిపిస్తున్నాయి. రెండు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు మర్డర్ కేసుగా నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.
Bar and Restaurant
Mumbai
Two dead
Murder

More Telugu News