Meera Chopra: ఇలాంటివాళ్లను స్వేచ్ఛగా వదలకూడదు: కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన మీరా చోప్రా

Meera Chopra thanked minister KTR
  • మీరా చోప్రాను ట్రోల్ చేస్తున్న ఓ హీరో అభిమానులు
  • మీరా విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్
  • మీ మేలు మర్చిపోలేనన్న మీరా చోప్రా
నటి మీరా చోప్రాకు, ఓ హీరో అభిమానులకు మధ్య జరుగుతున్న వార్ తెలంగాణ ప్రభుత్వం వరకు వెళ్లింది. తనపై కొందరు తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మీరా చోప్రా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసింది. దాంతో ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీలకు విషయం తెలియజేశారు.

దీనిపై మీరా చోప్రా ట్విటర్ లో కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది. "థాంక్స్ సర్... మీ మేలు మర్చిపోలేను. మహిళల భద్రతకు ఇది ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. ఇలాంటి వాళ్లను స్వేచ్ఛగా వదలకూడదు, లేకుంటే మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయి" అంటూ ట్వీట్ చేసింది.
Meera Chopra
KTR
Jr NTR
Fans
Telangana

More Telugu News