KTR: నటి మీరా చోప్రా విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్

KTR responds on Meera Chopra tweet
  • ట్రోలింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మీరా చోప్రా
  • ఈ విషయంపై కేటీఆర్ కు, కల్వకుంట్ల కవితకు ట్వీట్
  • తెలంగాణ డీజీపీతో మాట్లాడానన్న కేటీఆర్
ఓ హీరో అభిమానులు తనను దారుణంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి మీరా చోప్రా తనపై ఇప్పటికీ బెదిరింపులు వస్తుండడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేశారు. సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని, యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని, ఇంకా అనేక రకాలుగా దూషిస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

మీరా చోప్రా విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్ ట్విట్టర్ లో బదులిచ్చారు. "మేడమ్, ఈ విషయాన్ని పరిశీలించాలని నేను తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను కోరాను. మీ ఫిర్యాదుపై చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించాను" అంటూ ట్వీట్ చేశారు.

KTR
Meera Chopra
Jr NTR
Fans
Troll

More Telugu News