Buddha Venkanna: పారిశ్రామిక వేత్తలు క్యూలో ఉన్నారా?... ఎక్కడో చెప్పండి, వెళ్లి మజ్జిగ ప్యాకెట్లు అయినా ఇస్తాం: బుద్ధా వెంకన్న వ్యంగ్యం

Buddha Venkanna satirical comments on Vijayasai Reddy
  • జగన్ వచ్చాక పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారన్న విజయసాయి
  • నిజమేనంటూ బుద్ధా వ్యంగ్యం
  • సూట్ కేసు కంపెనీలకు జగన్ గాడ్ ఫాదర్ అంటూ వ్యాఖ్యలు
సీఎం జగన్ పాలన మొదలయ్యాక రాష్ట్రానికి పెట్టుబడుల రాక అధికమైందని, దేశవిదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చేందుకు క్యూలో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'పారిశ్రామికవేత్తలు క్యూలో నిల్చున్నారా? ఎక్కడో చెప్పండి... వెళ్లి మజ్జిగ ప్యాకెట్లు అయినా ఇస్తాం' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 'పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసిన జైలుపక్షులను చూసి పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్న మాట వాస్తవమే సాయిరెడ్డి గారూ!' అంటూ ఎద్దేవా చేశారు. తండ్రి అధికారంలో ఉండగానే సూట్ కేసు కంపెనీలకు జగన్ గాడ్ ఫాదర్ అయ్యారని, మనీ లాండరింగ్ కు రింగ్ మాస్టర్ అయ్యారని, క్విడ్ ప్రో కో వ్యవహారానికి కింగ్ పిన్ అయ్యారని బుద్ధా ఆరోపించారు.
Buddha Venkanna
Vijay Sai Reddy
Jagan
Industrilists
Andhra Pradesh

More Telugu News