Andhra Pradesh: ఏపీలో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు... కృష్ణా జిల్లాలో ఇద్దరి మృతి

AP gets more cases as corona spreading in the state
  • గత 24 గంటల్లో 9,831 శాంపిల్స్ పరిశీలన
  • 21 మంది డిశ్చార్జి
  • 73కి పెరిగిన మృతుల సంఖ్య
ఏపీలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం తాజాగా బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో మొత్తం 9,831 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,427కి చేరింది.

కాగా, కృష్ణా జిల్లాలో కరోనాతో ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 73కి పెరిగింది. ఇక, కరోనా నుంచి కోలుకుని 21 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా విముక్తుల సంఖ్య 2,294కి చేరింది. ప్రస్తుతం 1,060 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
.
Andhra Pradesh
Corona Virus
Deaths
Positive
COVID-19

More Telugu News