Congress: రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

Gujarat Congress MLAs resign
  • ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు
  • పార్టీని వీడబోతున్న మరో ఎమ్మెల్యే
  • బీజేపీపై కాంగ్రెస్ నేతల ఫైర్
రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్‌తో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పాటిల్, కప్రడ ఎమ్మెల్యే జీతూ చౌదరి రాజీనామా లేఖలు సమర్పించినట్టు అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, మరొకరు కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కరోనాతో అల్లకల్లోలంగా మారిన రాష్ట్రంలో ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ప్రజలకు సాయం అందించడంలో దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలుపై దృష్టి సారిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ సతవ్ ఆరోపించారు.
Congress
Gujarat
Rajya Sabha Polls
BJP

More Telugu News