Kanna Lakshminarayana: రాజధాని రైతుల అంశంపై సీఎం జగన్ కు లేఖాస్త్రం సంధించిన కన్నా

AP BJP Chief Kanna Lakshminarayana writes CM jagan again
  • 170 రోజులుగా రాజధాని వాసులు ఆందోళన చేస్తున్నారు 
  • లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలుపుతున్నారని వివరణ
  • అమరావతిని పరిపాలనా రాజధానిగా ప్రకటించాలని డిమాండ్

ఏపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాజధాని రైతుల ఆందోళనలపై స్పందించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమకు అన్యాయం జరిగిందంటూ 170 రోజులుగా ఆందోళన చేస్తున్నారని సీఎం జగన్ కు లేఖ రాశారు. లాక్ డౌన్ లోనూ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. రాజధాని వాసుల డిమాండ్లను ప్రభుత్వం గౌరవించాలని హితవు పలికారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కన్నా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News