sudakar: డాక్టర్‌ సుధాకర్‌ కేసులో హైకోర్టులో విచారణ వాయిదా

sudakar case on high court
  • మానసిక ఆసుపత్రిలో నిర్బంధించారన్న సుధాకర్
  • మరో ఆసుపత్రికి తరలించాలని పిటిషన్
  • విచారణ జరిపిన హైకోర్టు
తనను నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 16 నుంచి ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నిర్బంధించారని సస్పెండైన విశాఖ ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు ఎటువంటి అనారోగ్యం లేదని వాదిస్తోన్న ఆయన తనను విశాఖ మానసిక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించాలని పిటిషన్‌ వేశారు.

దీనిపై ఈ రోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు వెకేషన్ తర్వాతకి వాయిదా వేసింది. కాగా, సుధాకర్‌పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సీబీఐ అధికారులు మరో కేసు రిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పూర్తిగా సీబీఐకు బదిలీ కావడంతో విశాఖ పోలీసుల దర్యాప్తు నిలిచిపోయింది.
sudakar
AP High Court
Andhra Pradesh
Vizag

More Telugu News