Allu Arjun: 'వేదంకు పదేళ్లు' అంటూ గుర్తు చేసుకున్న అల్లు అర్జున్!

  • విభిన్న కథతో  క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం
  • 2010లో విడుదలైన సినిమా  
  • ఈ బ్యూటిఫుల్‌ జర్నీలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు
A Decade of Vedam

విభిన్న కథతో  క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన వేదం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా అల్లు అర్జున్ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేశాడు.

'వేదానికి దశాబ్దం.. ఈ బ్యూటిఫుల్‌ జర్నీలో భాగస్వాములైన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దర్శకుడు క్రిష్‌కు, నటులు అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పాయ్‌కి, ఇతర నటులకు, టెక్నీషియన్లకు, వారిచ్చిన మద్దతుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే, కీరవాణి గారికి, ఆర్కా మీడియాకు ధన్యవాదాలు చెబుతున్నాను' అని బన్నీ అన్నాడు.

కాగా, ఈ సినిమాలో ఓ బస్తీలో కేబుల్ ఆపరేటర్ 'కేబుల్ రాజు'గా అల్లు అర్జున్ నటించాడు. మనిషిగా పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావిస్తుంటాడు. చివరకు ఈ సినిమాలో ఉగ్రవాదులను చంపేసి చనిపోతాడు.

More Telugu News