vijay mallya: భారత్‌కు విజయ్ మాల్యాను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం

  • మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయిన వైనం
  • ఏ క్షణంలోనైనా భారత్‌కు విజయ్‌ మాల్యా అప్పగింత
  • న్యాయ ప్రక్రియలన్నీ పూర్తి  
vijay mallya to india

భారతీయ బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయల రుణాలు తీసుకుని, ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్‌ కోర్టుల్లో అన్ని దారులూ మూసుకుపోయాయి. రుణాల ఎగవేతకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై భారతదేశానికి తనను అప్పగించవద్దని కోరుతూ చేసుకున్న దరఖాస్తును బ్రిటన్ సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన 28 రోజుల్లోగా మాల్యాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం ప్రారంభించాల్సి ఉంటుంది. మే 14 నే తీర్పు వెల్లడైన నేపథ్యంలో నిబంధనల ప్రకారం 28 రోజుల్లోగా భారత్‌ కు తీసుకొచ్చేందుకు భారత అధికారులకు వీలు ఉంది.

ఇప్పటికే 20 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా భారత్‌కు విజయ్‌ మాల్యాను బ్రిటన్‌ అప్పగించనుంది. భారత్‌కు ఆయనను తీసుకొచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి భారత అధికారులు న్యాయ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది.

More Telugu News