Devineni Uma: దీనికేనా ఒకఛాన్స్ అడిగింది, చెప్పండి వైఎస్‌ జగన్ గారు?: దేవినేని ఉమ

devineni fires on ycp
  • రంగులు మార్చాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పుఇచ్చింది
  • కోర్టు తీర్పు పాటించకపోవడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే 
  • మెజారిటీ వచ్చిన అహంకారంతో మూర్ఖంగా వ్యవహరించారు
  • వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారు  
ఏపీలో గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయంపై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

'రంగులు మార్చాల్సిందే.. ప్రభుత్వం ఇచ్చే పాలనాపరమైన ఆదేశాలేవైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి. కోర్టు తీర్పు పాటించకపోవడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. మెజారిటీ వచ్చిన అహంకారంతో పాలకులు మూర్ఖంగా వ్యవహరించి వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారు దీనికేనా ఒకఛాన్స్ అడిగింది చెప్పండి  వైఎస్‌ జగన్ గారు' అని ట్విట్టర్‌లో నిలదీశారు.
 
కాగా, ప్రభుత్వం కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులను తొలగించాల్సిందేనని, ఇందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని  సుప్రీంకోర్టు తెలిపిన విషయం తెలిపిందే. న్యాయస్థానం తీర్పులను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. అలా చేయకపోతే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు.
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News