Chattisghad: ఉద్యోగి భార్యపై చత్తీస్ గఢ్ ఐఏఎస్ అధికారి అత్యాచారం!

  • ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి
  • ఆయన భార్యకు అశ్లీల సందేశాలు పంపిన కలెక్టర్
  • కేసును రిజిస్టర్ చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
Rape Alligations of Chattisghad Collector

తన భర్తను ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించిన ఐఏఎస్ అధికారి, ఆయన కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో కలకలం రేపింది. జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ గత నెల 15న తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ (33) ఫిర్యాదు చేసింది.

తన భర్త ప్రభుత్వ ఉద్యోగి అని, తాను చెప్పినట్టు వినకుంటే, అతన్ని డిస్మిస్ చేస్తానని బెదిరించి ఈ పనికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఆయన్నుంచి తనకు అశ్లీల సందేశాలు కూడా వచ్చాయని పేర్కొంటూ, వాటి స్క్రీన్ షాట్స్ ను కూడా ఫిర్యాదుకు జతచేసింది.

దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ పారుల్ మాథుర్, కలెక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. ఆయనపై భారతీయ శిక్షాస్మృతిలోని 376, 506, 309 బీ కింద కేసు రిజిస్టర్ అయిందని అన్నారు. ఇదిలావుంచితే, గత నెల 27న ఆయన ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ గా బదిలీ అయ్యారు. కాగా, ఇంకా జనక్ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.

More Telugu News