Gujarat: గుజరాత్‌లోని రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

40 workers injured in boiler blast at Bharuch chemical factory
  • దహేజ్ పారిశ్రామికవాడలో ఘటన
  • 30 మందికిపైగా గాయాలు
  • విషవాయువులు వెలువడడంతో స్థానికులను ఖాళీ చేయించిన అధికారులు
గుజరాత్‌లోని పారిశ్రామిక ప్రాంతం దహేజ్‌లోని ఓ రసాయన పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వెలువడుతుండడంతో సమీపంలోని గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో దాదాపు 40 మంది కార్మికులకు మంటలు అంటుకున్నట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని భారుచ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్టు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారుచ్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
Gujarat
Bharuch
chemical factory
boiler

More Telugu News